భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: యాషెస్‌ సిరీస్‌లో భాగంగా సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్‌ అయిదో టెస్ట్‌ మ్యాచ్‌లో తలపడుతున్నాయి. నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లాండ్‌ 75 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 302 పరుగులు చేసింది. ఇంగ్లాండ్‌ బ్యాటర్‌ జాకబ్‌ బెథెల్‌ (Jacob Bethell) భారీ సెంచరీతో (142*; 232 బంతుల్లో, 15 ఫోర్లు) అజేయంగా నిలిచాడు. ప్రస్తుతం ఇంగ్లాండ్‌ 119 పరుగుల ఆధిక్యంలో ఉంది. అయితే ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌కు విజయావకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. ఇంగ్లాండ్‌ గెలవాలంటే ఏదైనా…