భారత్ సమాచార్.నెట్, మెదక్: మెదక్లో నిర్వహించిన జిల్లా సమీక్షా సమావేశంలో ఎంపీ రఘునందన్ రావు కాలుష్య నియంత్రణపై అధికారుల తీరును తప్పుబట్టారు. ముఖ్యంగా సంగారెడ్డి ప్రాంతంలోని కంకర మిషన్ల (Crushers) నుండి విపరీతంగా దుమ్ము వెలువడుతున్నా, కాలుష్య నియంత్రణ మండలి అధికారులు పట్టించుకోవడంలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
దీనివల్ల స్థానిక ప్రజల ఆరోగ్యం దెబ్బతింటోందని, పర్యావరణం కలుషితమవుతోందని మండిపడ్డారు. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని సంగారెడ్డి కలెక్టర్ ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని…





