భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: చైనాలోని ఓ స్కూల్లో 100 మందికి పైగా విద్యార్థులు నోరోవైరస్ వల్ల అస్వస్థతకు గురయ్యారు. ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ, ఇది కొత్త వైరస్ కాదు. 1968లో అమెరికాలోనే ఈ నోరోవైరస్ (నోరోవైరస్) బయటపడింది. ఇది ప్రపంచవ్యాప్తంగా తరచూ కలకలం రేపుతుంటుంది.
భారతదేశంలో కూడా ఇది కొత్తది కాదు. గతంలో కేరళ, పుణే వంటి ప్రాంతాల్లో ఈ వైరస్ వ్యాప్తి చెంది సంచలనం సృష్టించింది. ఆహారం, కలుషిత నీరు లేదా సోకిన వ్యక్తి సంబంధం ద్వారా…

