భారత్ సమాచార్, సినీ టాక్స్ : ఒకప్పుడు హీరోయిన్లు రెండు, మూడు దశాబ్దాల పాటు వెండితెరపై నాయికగా రాణించేవారు. వారికి సినీ ఇండ్రస్టీలో అలాంటి అవకాశాలు కూడా లభించేవి. ఇందుకు శ్రీదేవి, జయసుధ, జయప్రద లాంటి వారిని ఉదాహరణగా తీసుకోవచ్చు. అక్కినేని నాగేశ్వరరావు పక్కన చిందులు వేసిన శ్రీదేవి, నాగార్జునకు జోడిగా కూడా నటించింది. సీనియర్ ఎన్టీఆర్ మనవరాలిగా నటించి తిరిగి అదే హీరోతో కథానాయికగా మెప్పించిన ఏకైక హీరోయిన్ గా నిలిచింది అతిలోక సుందరి శ్రీదేవి. చిరంజీవికి హీరోయిన్ గా నటించిన జయసుధ..…