భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: బంగ్లాదేశ్‌లో (Bangladesh) హిందూ మైనారిటీలపై జరుగుతున్న దాడులకు నిరసనగా పశ్చిమ బెంగాల్‌లోని హోటల్ యజమానుల సంఘాలు సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ఇటీవల బంగ్లాదేశ్‌లో దీపు చంద్ర దాస్ అనే హిందూ యువకుడిని దారుణంగా హత్య చేసిన ఘటనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇకపై బంగ్లాదేశ్ పర్యాటకులకు తమ హోటళ్లు, లాడ్జీలలో బస కల్పించకూడదని నిర్ణయించారు.

 

అంతర్జాతీయ సరిహద్దుకు ఆనుకుని ఉన్న డార్జిలింగ్, మాల్దా జిల్లాల హోటల్ యజమానుల సంఘాలు ఈ మేరకు ఏకగ్రీవ తీర్మానం చేశాయి. మాల్దా అసోసియేషన్…