భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: దేశ భద్రతను దెబ్బతీయాలనే ఉద్దేశంతో పాక్‌ నుంచి డ్రోన్‌ల సాయంతో ఆయుధాలను అక్రమంగా భారత్‌లోకి తరలించే భారీ రాకెట్‌ను దిల్లీ పోలీసులు ఛేదించారు. డీసీపీ సంజీవ్‌ కుమార్‌ యాదవ్‌ నేతృత్వంలోని బృందం నిఘా సమాచారం ఆధారంగా ఈ ఆపరేషన్‌ చేపట్టి, రోహిణి ప్రాంతంలో ఈ ముఠా కార్యకలాపాలను పట్టు పట్టింది.

 

ప్రాథమిక విచారణలో ఈ గ్యాంగ్‌ పాక్‌ ఐఎస్‌ఐతో ప్రత్యక్ష సంబంధాలు కలిగి ఉందని పోలీసులు వెల్లడించారు. నిందితులు డ్రోన్‌లను ఉపయోగించి పంజాబ్‌ సరిహద్దుల గుండా దేశంలోకి ఆయుధాలను రవాణా…