భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: విద్యార్థుల ఉజ్వల భవిష్యత్తు కోసం వేసవి సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఇనుగుర్తి పాఠశాల విద్యాభివృద్ధి కమిటీ ప్రతినిధులు బుధవారం జాయింట్ కలెక్టర్ అనిల్ కుమార్, డీఈవో రాజేశ్వరరావులకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎస్ఎంసీ అధ్యక్షులు దార్ల రామ్మూర్తి, దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు మాట్లాడుతూ.. సెలవుల్లో విద్యార్థులకు ప్రత్యేక శిక్షణ ఇవ్వడం వల్ల వచ్చే విద్యా సంవత్సరానికి వారు సన్నద్ధంగా ఉంటారని తెలిపారు. వేసవి తరగతుల ద్వారా విద్యార్థుల్లో చదువుపై…