భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: ప్రస్తుత వేసవి కాలంలో కాలనీలలో తాగునీటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని.. నిరంతరం క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితులను సమీక్షించాలని జలమండలి అధికారులకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సూచించారు. మంగళవారం సాయంత్రం పటాన్చెరు డివిజన్ పరిధిలోని క్యాంప్ కార్యాలయంలో అమీన్పూర్ సర్కిల్, పటాన్చెరు సర్కిల్ జలమండలి అధికారులతో తాగునీటి పంపిణీపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి ఆటంకాలు లేకుండా తాగునీరు అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని తెలిపారు.…
తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా పటిష్ట ప్రణాళిక: ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




