భారత్ సమాచార్.నెట్, మధ్యప్రదేశ్: చెరువులో మునిగిపోతున్న తన భార్య కోసం భర్త చెరువులో దూకిన ఘటన మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సత్నాలో చోటు చేసుకుంది. అతను ఆమెను మృత్యువు బారి నుంచి కాపాడాడు. కానీ అతను తన ప్రాణాలను మాత్రం దక్కించుకోలేకపోయాడు.
భార్యను రక్షించి భర్త తనువు చాలించాడు:
మధ్యప్రదేశ్లోని సత్నా జిల్లాలోని ఉంచెహ్రా పరిధిలోని పరస్మానియా నివాసి రాజ్ బహదూర్ సింగ్ గోండ్ తన కుటుంబంతో కలిసి ఇంటి సమీపంలోని చెరువులో స్నానం చేయడానికి వెళ్లాడు. ఈ కుటుంబం ఇటీవల తమ పిల్లలలో…

