భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ప్రపంచవ్యాప్తంగా వృద్ధుల సమస్యలు పెరుగుతున్న ఈ కాలంలో, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) మరో సరికొత్త సాంకేతిక పరిష్కారాన్ని ఆవిష్కరించేందుకు అడుగులు వేస్తోంది. రోజువారీ జీవితంలో సహాయం అవసరమైన వృద్ధులకు సాంకేతిక సహకారంతో సురక్షితమైన, స్వతంత్ర జీవన విధానాన్ని అందించాలన్న లక్ష్యంతో సంస్థ ముందుకు వచ్చింది.
ఈ క్రమంలో టీసీఎస్ యూరప్‌లో ప్రసిద్ధ పరిశోధనా సంస్థ *సింటెఫ్ (SINTEF)తో వ్యూహాత్మక ఒప్పందం కుదుర్చుకుంది. ఇందుకుగాను ‘స్మార్ట్ ఇన్‌క్లూజివ్ లివింగ్ ఎన్విరాన్మెంట్స్ (SMILE)*’ అనే ప్రాజెక్టును పరిశోధనాత్మకంగా అభివృద్ధి చేస్తున్నారు. ఈ…



