భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ రీఎంట్రీ మరింత ఆలస్యం కానుంది. డిసెంబర్ 14 నుంచి ప్రొఫెషనల్ క్రికెట్‌కు దూరంగా ఉన్న శుభ్‌మన్ గిల్.. ప్రతిష్టాత్మక దేశవాళీ వన్డే టోర్నీ విజయ్ హజారే ట్రోఫీతో మైదానంలోకి అడుగుపెడుతాడని వార్తలు వచ్చాయి. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా శనివారం సిక్కింతో జరిగే మ్యాచ్‌లో పంజాబ్ తరఫున శుభ్‌మన్ గిల్ బరిలోకి దిగాల్సి ఉంది. శుభ్‌మన్ గిల్ రీఎంట్రీతో జైపూర్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌‌ను ప్రేక్షకులు లేకుండా నిర్వహించాలని బీసీసీఐ…