భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీకి టీమిండియా వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌ను ఎంపిక చేయకపోవడాన్ని మాజీ క్రికెటర్ యోగ్‌రాజ్ సింగ్ తప్పుబట్టాడు. నాలుగు మ్యాచ్‌ల్లో విఫలమైనంత మాత్రానా జట్టులో నుంచి తప్పించడం సరికాదన్నాడు. శుభ్‌మన్ గిల్‌కు మరిన్ని అవకాశాలు ఇవ్వాలని సూచించాడు. ఐసీసీ టీ20 ప్రపంచకప్ 2026 టోర్నీ‌తో పాటు న్యూజిలాండ్‌తో ఐదు టీ20ల సిరీస్‌కు బీసీసీఐ 15 మంది సభ్యులతో కూడిన భారత జట్టును ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ జట్టు నుంచి శుభ్‌మన్…