భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. పటాన్‌చెరు జేపీ లయన్స్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, 18 పాఠశాలలకు చెందిన రెండువేల మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అదే సందర్భంగా రాజ్యాంగం, మన హక్కులు, బాధ్యతలపై అవగాహన సదస్సు కూడా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా యువజన సంఘాల సమితి అధ్యక్షుడు కూన వేణు, సంగారెడ్డి జిల్లా కోర్టు పబ్లిక్ ప్రాసిక్యూటర్ శ్రీరాములు, లా అండ్ ఆర్డర్ సీఐ వినాయక రెడ్డి, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్ కమిటీ సభ్యులు చంద్రశేఖర్, పలువురు ప్రముఖులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
29, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్