భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: 76వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా, విద్యార్థుల్లో రాజ్యాంగం పట్ల అవగాహన పెంచే లక్ష్యంతో MDR ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాసరచన పోటీ విజేతలకు బహుమతులు అందజేశారు. పటాన్‌చెరు జేపీ లయన్స్ క్లబ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో, 18 పాఠశాలలకు చెందిన రెండువేల మందికి పైగా విద్యార్థులు పాల్గొనగా, ఉత్తమ ప్రతిభ కనబరిచిన 180 మంది విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. అదే సందర్భంగా రాజ్యాంగం, మన హక్కులు, బాధ్యతలపై అవగాహన సదస్సు కూడా…