భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, నవంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

పొలాల్లోకి దూసుకెళ్లిన బస్సు.. ఇద్దరికి స్వల్పగాయాలు

WhatsApp Image 2025-11-29 at 3.48.31 PM

భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: తుగ్గలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం తప్పింది. మంత్రాలయం దిశగా వెళ్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. బస్సు స్టీరింగ్ విరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్ గౌడ్ వివరించారు. బెంగళూరు నుంచి మంత్రాలయానికి ప్రయాణిస్తున్న ఈ బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉండగా, కిరణ్, అనుశ్రీలకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే సీఐ పులిశేఖర్ గౌడ్, ఎస్సై బాల నరసింహులు సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. డ్రైవర్ చాకచక్యంతో పెద్ద ప్రమాదం తప్పడంతో ప్రయాణికులు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నారు.