భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: తుగ్గలి రైల్వే స్టేషన్ సమీపంలో ఘోర ప్రమాదం తప్పింది. మంత్రాలయం దిశగా వెళ్తున్న కర్ణాటక రాష్ట్రానికి చెందిన ఓ ప్రైవేట్ బస్సు ప్రమాదవశాత్తు అదుపుతప్పి పొలాల్లోకి దూసుకెళ్లి బోల్తా పడింది. బస్సు స్టీరింగ్ విరగడంతో ఈ ప్రమాదం జరిగినట్లు పత్తికొండ రూరల్ సీఐ పులిశేఖర్ గౌడ్ వివరించారు. బెంగళూరు నుంచి మంత్రాలయానికి ప్రయాణిస్తున్న ఈ బస్సులో మొత్తం 29 మంది ప్రయాణికులు ఉండగా, కిరణ్, అనుశ్రీలకు మాత్రమే స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే సీఐ పులిశేఖర్…