భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: ఆదోని నియోజకవర్గంలోని సాదాపురం పంచాయతీలో సోమవారం ఉదయం ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమం జరిగింది. మాజీ ఎమ్మెల్యే, ఆదోని టీడీపీ ఇంఛార్జ్ మీనాక్షి నాయుడు ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. టీడీపీ సీనియర్ నాయకుడు ఉమాపతి నాయుడు ఆధ్వర్యంలో, గ్రామ నాయకులు, సచివాలయ సిబ్బందితో కలిసి ఇంటింటికీ వెళ్లి పింఛన్లను లబ్ధిదారులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో రంగస్వామి నాయుడు, మండల అధ్యక్షుడు శివప్ప, జనరల్ సెక్రటరీ రంగన్న, కృష్ణారెడ్డి, సోదాపూర్ రాజశేఖర్, మనోహర్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
1, డిసెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్