భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

4, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

ప్రలోభ పర్వాలు.. ఏకగ్రీవాలు

local-body-election-2025-09-29-15-27-45

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రాష్ట్రంలో పలు గ్రామపంచాయతీలు ఏకగీవ్రం అవుతున్నాయి. సంగారెడ్డి నియోజకవర్గంలో పలు గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. అవి… సదాశివపేట మండలంలో 30 గ్రామాలు ఉండగా, 30 గ్రామాలలో మొత్తం 272 వార్డు స్థానాలకు 629 మంది అభ్యర్థులు పోటీ చేయగా 12 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మండలంలో 30 సర్పంచులకు ఒక మిలిగిరిపేట గ్రామ సర్పంచ్ అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అదేవిధంగా కంది మండలంలో మొత్తం 22 గ్రామాలు ఉండగా రెండు గ్రామాల సర్పంచులు ఏకగ్రీవం అయ్యాయి. తునికీల తండా గ్రామం కూడా ఏకగ్రీవం అయింది. ఎర్రదనుర్ తండాలో ఒక సర్పంచ్, 6 వార్డు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా రెండు వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కొండాపూర్ మండలంలో మొత్తం 24 గ్రామాలకు ఎన్నికలు జరగనుండగా, మండలంలోని మనసంపల్లి గ్రామంలో 7 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. ఒక సర్పంచ్,ఒక వార్డుకు ఎన్నికలు నిర్వహించనున్నారు. సంగారెడ్డి మండలంలో మొత్తం 11 గ్రామాలు ఉండగా మొత్తం 75 నామినేషన్లు రాగా 40 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. మండలంలో మొత్తం ఏడు వార్డులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతావన్నీ ఎన్నికలు జరగనున్నాయి.