భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

10, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

పెట్రోల్ బంకుల్లో మౌలికవసతులు కల్పించాలి: పీ.నిత్యానందం

3d971b4c-629d-46eb-82d3-9e76e7a44390

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలని మెదక్ జిల్లా పౌరసరఫరాల అధికారి పీ.నిత్యానందం పేర్కొన్నారు. ప్రజలకు పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలని పౌరసరఫరాల అధికారి పీ.నిత్యానందం బంక్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ బంక్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంధన కొలతలు, నాణ్యత, ధరల ప్రదర్శన, భద్రతా ప్రమాణాలు, వినియోగదారులకు కల్పించాల్సిన కనీస మౌలిక వసతులను పరిశీలించారు. తనిఖీలో ఇంధన కొలతల్లో తేడాలు, ఫిల్టర్ పేపర్ టెస్ట్‌లో అనుమానాస్పద ఫలితాలు, తాగునీరు, టాయిలెట్స్, ఫస్ట్ ఎయిడ్, టైర్లకు ఉచిత గాలి వంటి సదుపాయాల లేమి వంటి పలు లోపాలు బయటపడ్డాయి. చట్టప్రకారం పెట్రోల్ బంకుల్లో ఈ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని సూచించారు.

శ్రీనివాస పెట్రోల్ బంక్‌‌పై కేసు నమోదు:
వినియోగదారులను మోసం చేసే విధంగా వ్యవహరించడం తీవ్రంగా ఖండించారు. ఇంధనాన్ని కచ్చితమైన కొలతలతో, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా విక్రయించడం బంక్ నిర్వాహకుల చట్టబద్ధ బాధ్యత అని అన్నారు. వినియోగదారుల హక్కులను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. బంక్‌పై ప్రాథమిక కేసు నమోదు చేసి, సంబంధిత చట్టాల కింద వివరణ కోరినట్లు, అవసరమైతే బంక్‌ను సీజ్ చేయడం సహా కఠిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. వాహనదారులకు ఇంధన నాణ్యత, కొలతపై సంబంధించిన అనుమానాలు ఉన్నప్పుడు బంకులో ఉండే కొలతల క్వాలిటీ చెక్ సామగ్రి చూపించాలని డిమాండ్ చేయొచ్చని, అలాంటి సహకారం అందించని పక్షంలో వెంటనే పౌరసరఫరాల లేదా లీగల్ మెట్రాలజీ శాఖకు ఫిర్యాదు చేయాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి ఆకస్మిక తనిఖీలు కొనసాగుతాయని, నిబంధనలు ఉల్లంఘించే బంకులపై ఎటువంటి కనికరం చూపబోమని స్పష్టం చేశారు.