భారత్ సమాచార్, మెదక్ జిల్లా: పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలని మెదక్ జిల్లా పౌరసరఫరాల అధికారి పీ.నిత్యానందం పేర్కొన్నారు. ప్రజలకు పెట్రోల్ బంకుల్లో మౌలిక వసతులు కల్పించాలని పౌరసరఫరాల అధికారి పీ.నిత్యానందం బంక్ నిర్వాహకులకు సూచించారు. బుధవారం మెదక్ పట్టణంలోని శ్రీనివాస పెట్రోల్ బంక్‌ను ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఇంధన కొలతలు, నాణ్యత, ధరల ప్రదర్శన, భద్రతా ప్రమాణాలు, వినియోగదారులకు కల్పించాల్సిన కనీస మౌలిక వసతులను పరిశీలించారు. తనిఖీలో ఇంధన కొలతల్లో తేడాలు, ఫిల్టర్ పేపర్ టెస్ట్‌లో…