భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

13, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

సర్పంచ్ అభ్యర్థికి అపూర్వ స్వాగతం

32

భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: రాచుర్ సర్పంచ్ అభ్యర్థి మెత్రి ఉనికేశ్వర్ ఎన్నికల ప్రచారంలో దూకుడు పెంచారు. శనివారం ఇంటింటి ప్రచారంలో ఆయనకు అపూర్వ స్పందన లభించింది. మహిళలు ఉనికేశ్వర్‌ను హారతులతో ఆహ్వానించి, తమ బిడ్డగా భావించి కుంకుమ తిలకం దిద్దారు. నిరుపేద కుటుంబం నుంచి వచ్చి ప్రజా సేవకుడిగా పేరు సంపాదించుకున్న ఉనికేశ్వర్‌పై తమకు పూర్తి నమ్మకం ఉందని, రాచుర్‌ను ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేస్తారని గ్రామస్థులు ధీమా వ్యక్తం చేశారు. ఈసారి ఉంగరం గుర్తుపై ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపిస్తామని హామీ ఇచ్చారు. గెలిచిన తర్వాత ప్రతి ఆడపడుచుకు పెళ్లి కానుకగా ఆర్థిక సహాయం, అంబేద్కర్ విగ్రహం ఏర్పాటుతో పాటు గ్రామాభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఉనికేశ్వర్ హామీ ఇచ్చారు. ప్రజల సంపూర్ణ ఆశీస్సులతో ఆయన విజయం ఖాయమనే ధీమా వ్యక్తమవుతోంది.