భారత్ సమాచార్, నంద్యాల జిల్లా: రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ మోమిన్ అహ్మద్ హుస్సేన్ కుమార్తె, కుమారుడి వివాహ మహోత్సవం ఆత్మకూరు పట్టణంలోని ఎల్వీ ఫంక్షన్ హాల్లో వైభవంగా జరిగింది. ఈ వేడుకలకు శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణి రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో నంద్యాల పార్లమెంట్ ఇంచార్జి ఎమ్మెల్సీ కల్పలత రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ భాష, వైఎస్ఆర్సీపీ నాయకులు బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, కేఈ ప్రభాకర్ తదితర ప్రముఖులు పాల్గొన్నారు. పట్టణ, గ్రామ, జిల్లా స్థాయి వైఎస్ఆర్సీపీ నాయకులతో పాటు ఇతర పార్టీల ప్రముఖులు కూడా పెద్ద సంఖ్యలో హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.
BHARATH SAMACHAR DIGITAL
14, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్