భారత్ సమాచార్.నెట్, కామారెడ్డి జిల్లా: మద్నూర్ మండలంలోని తడ్గూర్ గ్రామ పంచాయతీ ఎన్నికల బరిలో ఉన్న సర్పంచ్ అభ్యర్థిని శాంతా బాయి ఇరన్న, గ్రామాభివృద్ధికి ఒక్క అవకాశం ఇవ్వాలని ప్రజలను అభ్యర్థించారు. జుక్కల్ ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంత రావు బలపర్చిన ఈమె.. ప్రజాసేవ, గ్రామాభివృద్ధియే తన లక్ష్యమని స్పష్టం చేశారు.
గత 20 ఏళ్లుగా సమాజ సేవ చేస్తున్నానని తెలిపిన శాంతా బాయి.. సర్పంచ్‌గా గెలిస్తే సీసీ రోడ్లు, డ్రైనేజీ, ఇంటింటికీ తాగునీరు, యువతకు లైబ్రరీ వంటి మౌలిక వసతులను కల్పిస్తానని హామీ ఇచ్చారు. అర్హులందరికీ ప్రభుత్వ సంక్షేమ ఫలాలు చేరేలా కృషి చేస్తానని, ఇప్పటికే ఎమ్మెల్యే సహకారంతో 50 ఇందిరమ్మ ఇళ్లు, రెండు అంగన్వాడీ కేంద్రాలు, సబ్ స్టేషన్ మంజూరయ్యాయని తెలిపారు. యువతకు ఉపాధి శిక్షణ కల్పిస్తానని, ఉంగరం గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని గ్రామ ఆడపడుచుగా విజ్ఞప్తి చేశారు.