భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: పటాన్ చెరు యువజన వికాస్ సమితి ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ 75వ వర్ధంతి కార్యక్రమాన్ని పటాన్ చెరు డిగ్రీ కాలేజ్ సమీపంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పటాన్ చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్ హాజరై సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. దేశానికి సర్ధార్ వల్లభాయ్ పటేల్ చేసిన సేవలు చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో యువజన వికాస్ సమితి అధ్యక్షుడు విజయ్ (అడ్వకేట్), జడ్పీ హెచ్ఎస్ గర్ల్స్ హైస్కూల్ ప్రిన్సిపల్ స్పందన, నరసింహ, బల్వంత్ రెడ్డి, అజ్జు అజ్మల్, మెట్టు కళ్యాణ్ యాదవ్, అఫ్జల్, యువజన వికాస్ సమితి సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
BHARATH SAMACHAR DIGITAL
15, డిసెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్