భారత్ సమాచాచార్, సంగారెడ్డి జిల్లా: రుద్రారంలోని గీతం యూనివర్సిటీలో నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమం జరిగింది . యువత డ్రగ్స్ కు అలవాటు పడడం, డ్రగ్స్ రహిత సమాజ నిర్మాణం ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి నిషేదణల శ్రీనివాస్ అధ్యక్షత వహించారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి, క్రైమ్ బ్రాంచ్ రమేష్, కమ్యూనిటీ ఎడ్యుకేటర్ హుమేరా షాహిస్తా, డైరెక్టర్ క్యాంపస్ లైఫ్ అంబికా ఫిలిప్, రెసిడెంట్ డైరెక్టర్ డాక్టర్ వర్మ దాట్ల, సీనియర్ మేనేజర్ (DOS) సంతోష్ కుమార్ యాదవ్, స్టూడెంట్స్ యాంటి డ్రగ్స్ కమిటీ కన్వీనర్ డాక్టర్ పీ.శ్రీనివాస్ SADC, స్టూడెంట్ లైఫ్ డాక్టర్ పీవీ నాగేంద్రకుమార్, కెమిస్ట్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్, NSS ప్రోగ్రామ్ కోఆర్డినేటర్, మెంబర్, కన్వీనర్, స్టూడెంట్ యాంటీ డ్రగ్ కమిటీ, GITAM, Hyd, DOSL, మేనేజర్ ఫిజా అబ్రార్ పాల్గొని మాట్లాడారు.
మాదకద్రవ్యాల దుర్వినియోగం, సంబంధిత సెక్షన్లు, శిక్షలు, మాదకద్రవ్యాలకు, నేరాలకు సంబంధించిన జరిమానాల గురించి వివరించారు. యువత శ్రేయస్సు, సామాజిక బాధ్యతను ప్రోత్సహించే ప్రభుత్వ కార్యక్రమాలకు మద్దతు ఇవ్వడానికి సంస్థ నిబద్ధతను ఇది పునఃరుద్ఘాటించింది.”నషా ముక్త్ భారత్”కు సహకరించాలని, మాదక ద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో బాధ్యతాయుతమైన పౌరులుగా, ఆరోగ్య సంరక్షణ ప్రదాతలుగా వ్యవహరిస్తామని ప్రతిజ్ఞ చేయించారు.