భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

కబడ్డీ పోటీల్లో సత్తా చాటిన మోడల్ స్కూల్ విద్యార్థులు

9bd87c7c-e456-4a0f-95bb-89beb2d7cb29

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల్ బ్లాక్ లెవెల్ కకబడ్డీ పోటీలు వరంగల్ మేరా యువభారత్ ఆధ్వర్యంలో బుధవారం నెల్లికుదురులో నిర్వహించారు. ఈ పోటీలలో స్థానిక మోడల్ స్కూల్ విద్యార్థులు అసాధారణ ప్రతిభ కనబరిచి బ్రదర్ ప్రధమ స్థానంలో నిలిచి కాప్ కైవసం చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆ పాఠశాల ప్రిన్సిపాల్ జీ.ఉపేందర్ రావు హర్షం వ్యక్తం చేసి మాట్లాడుతూ.. నిజ జీవితంలో క్రీడలు మానసికంగా, శారీరకంగా ధృడత్వాన్ని పెంపొందించడానికి తోడ్పడతాయన్నారు. క్రీడల్లో గెలుపు ఓటములను సమానంగా స్వీకరించినప్పుడే భవిష్యత్తులో ముందడుగు వేస్తారన్నారు. కార్యక్రమంలో కళాశాల ఫిజికల్ డైరెక్టర్ కొమురయ్య, మేరా యువ భారత్ జిల్లా యూత్ కోఆర్డినేటర్ ధరావత్ రాజేందర్ నాయక్, అధ్యాపకులు కుటుంబరావు, సక్రం రాథోడ్, జ్యోతి, అంజూమ్ సుల్తానా, నవీన్ కుమార్ విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.