భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

సంగారెడ్డి జిల్లాలో 87.43% పోలింగ్

153211165

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం 87.43 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మూడవ విడతగా కల్హేర్ , కంగ్టి, మనూర్, నాగల్ గిద్ద, నారాయణ్ ఖేడ్ ,నిజాంపేట్, న్యాల్కల్, సిర్గపూర్ మండలాలలో బుధవారం పోలింగ్ జరిగింది. ఈ ఎనిమిది మండలాల్లో కలిపి మొత్తం 2,25,483 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,97,134 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మొత్తం 87.43 శాతం పోలింగ్ నమోదైంది.

మండలాల వారీగా పోలింగ్ వివరాలు :
1) కల్హేర్ మండలం,
మొత్తం ఓటర్లు:16,823
ఓటేసిన వారు.14,814
పోలింగ్ శాతం:88.06. %

2) కంగ్టి మండలం:
మొత్తం ఓటర్లు:34,992
ఓటేసిన వారు: 30,153
పోలింగ్ శాతం:86.17 %

3) మనూర్ మండలం:
మొత్తం ఓటర్లు:25,038
ఓటేసిన వారు: 22,372
పోలింగ్ శాతం:89.35 %

4) నాగల్ గిద్ద మండలం:
మొత్తం ఓటర్లు:23,924
ఓటేసిన వారు: 21,012
పోలింగ్ శాతం:87.83 %

5) నారాయణ్ ఖేడ్ మండలం,
మొత్తం ఓటర్లు:39,503
ఓటేసిన వారు.34,591
పోలింగ్ శాతం:87.57 %

6) నిజాంపేట్ మండలం,
మొత్తం ఓటర్లు:16,181
ఓటేసిన వారు:14,388
పోలింగ్ శాతం:88.92 %

7) న్యాల్కల్ మండలం.
మొత్తం ఓటర్లు:47,040
ఓటేసిన వారు:40,452
పోలింగ్ శాతం:85.99 %

8) సిర్గాపూర్ మండలం.
మొత్తం ఓటర్లు:21,982
ఓటేసిన వారు:19,352
పోలింగ్ శాతం:88.04 %