భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: జిల్లాలో మూడవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం 87.43 శాతం పోలింగ్ నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. మూడవ విడతగా కల్హేర్ , కంగ్టి, మనూర్, నాగల్ గిద్ద, నారాయణ్ ఖేడ్ ,నిజాంపేట్, న్యాల్కల్, సిర్గపూర్ మండలాలలో బుధవారం పోలింగ్ జరిగింది. ఈ ఎనిమిది మండలాల్లో కలిపి మొత్తం 2,25,483 మంది ఓటర్లు ఉండగా, వీరిలో 1,97,134 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంతో మొత్తం 87.43 శాతం పోలింగ్ నమోదైంది.

మండలాల వారీగా పోలింగ్…