భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

18, డిసెంబర్ 2025, గురువారంభారత్ సమాచార్

రైతులు ఆర్గానిక్ పంటలు వేసేలా ప్రోత్సహించాలి

18aff734-20d5-4dc7-87a1-5260b19934ea

భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: కనిగిరి వ్యవసాయ మార్కెటింగ్ కమిటీ కార్యాలయంలో కమిటీ ఛైర్మన్ రమా శ్రీనివాస్ అధ్యక్షతన బుధవారం జరిగిన సమావేశంలో డైరెక్టర్ వాజిదా పాల్గొని మాట్లాడారు. రైతులకు ఆర్గానిక్ పంటలు వేసే విధంగా ప్రోత్సహించాలని అలాగే కనిగిరిలో ఆర్గానిక్ పంటలకు సంబంధించిన ఎరువులు విత్తనాలు వ్యవసాయ మార్కెట్ కమిటీ ద్వారా కనిగిరి పట్టణంలో ఒక షాపు పెట్టగలిగితే రైతులు వాటిని ఉపయోగించుకునే అవకాశం కల్పించినట్లు అవుతుందని ఆమె సభ దృష్టికి తీసుకువచ్చారు. సభ్యురాలు అడిగిన వాటికి సెక్రెటరీ రవి శంకర్ రెడ్డి మాట్లాడుతూ.. వ్యవసాయ శాఖ ద్వారా ఏర్పాటు చేయుటకు కృషి చేద్దామని తెలిపారు. ఈ విషయం మీద వ్యవసాయ శాఖ సంచాలకులు షేక్ జైనులాబ్దిన్ మాట్లాడుతూ.. కనిగిరి నియోజకవర్గంలో ఆర్గానిక్ పంటలు వేయడానికి చాలా మంది రైతులు గుర్తుకొస్తారని వారిని గుర్తించి ఆర్గానిక్ పంటలు వేసేదానికి డైరెక్టర్లు ఛైర్మన్ అందరు కలిసి రైతులకు అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి రైతులను ప్రోత్సహిద్దామని వారు తెలిపారు. అనంతరం మూడు మాసాలకు సంబంధించిన ఆదాయం వ్యయం లుగురించి తెలిపారు. అనంతరం వ్యవసాయ మార్కెట్ కమిటీ ఆవరణలో అసంపూర్తిగా మిగిలిన రూములను మరమ్మత్తులు చేయడానికి రూ.50లక్షలు ఖర్చు అవుతుందని సెక్రటరీ సభ దృష్టికి తీసుకువచ్చారు. సభలో ప్రవేశపెట్టిన అజెండా మేరకు అన్ని ఆమోదిస్తున్నట్లు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మానం చేశారు. ఈ సమావేశమునకు ఛైర్మన్ రమా శ్రీనివాస్ తోపాటు వైస్ ఛైర్మన్ పాలపర్తి వెంకటేశ్వర్లు, డైరెక్టర్లు బండారు వెంకట రమణయ్య, జయంపు సాలమ్మ, గాయం శివలక్ష్మి, కొడాలి రోశయ్య, మాదాల కొండలరావు, పల్లె పోగు చిన్ని, షేక్ వాజిదా, ఉల్లిపాయల సుభాషిని, వడ్డంపూడి మాధవరావు, షేక్ ఫాతిమా, టీ మనిషా, బొగ్గరపు శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు.