భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

ఎస్పీ శబరీష్‌కు పాలాభిషేకం.. ఎందుకంటే..?

a9191c39-7850-4d93-a261-a9a084da7778

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మానుకోట జిల్లా కురవి మండలం స్టేషన్ గుండ్రాతిమడుగు గ్రామంలో ఓ మహిళ ఇంటి స్థలం అక్రమనకు గురి చేస్తున్న కబ్జాదారులపై ఎస్పీ శబరీష్ సూచనల మేరకు పోలీసులు చట్టపరమైన కఠిన చర్యలు తీసుకున్నారు. దీంతో బాధిత మహిళ సులోచన ఎస్పీ శబరీష్ చిత్రపటానికి గురువారం పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా బాధిత మహిళ తాజ్నోత్ సులోచన తెలుపుతూ తన పాత ఇంటి స్థానంలో కొత్త ఇంటి నిర్మాణాన్ని ప్రభుత్వ అనుమతులతో నిర్మించుకుంటున్న క్రమంలో కొందరు భూ కబ్జాదారులు పనులకు ఆటంకం కలిగించడమే కాకుండా తన పైన పలుమార్లు దాడి చేశారన్నారు. ఈ మేరకు తన వద్ద ఉన్న పత్రాలతో పోలీసులను ఆశ్రయించగా పోలీసులు వెంటనే స్పందించి భూఆక్రమణదారుల మీద చట్టప్రకారం చర్యలు తీసుకున్నారని తెలిపారు. తన ఇంటి నిర్మాణం ఎలాంటి ఆటంకాలు లేకుండా పూర్తి అయిన సందర్భంగా మహబూబాబాద్ జిల్లా ఎస్పీ శబరీష్‌కి పాలాభిషేకం చేసి తన కృతజ్ఞతను చాటుకున్నట్లు ఆమె వివరించారు.