భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: అధికారులు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ షేక్ పేర్కొన్నారు. గురువారం కనిగిరి పట్టణంలోని శివనగర్ కాలనీలో ఆయన పర్యటించి మాట్లాడారు. పట్టణలోని శివనగర్ కాలనీలో వెనుకబడిన తరగతుల (బీసీ) బాలికల వసతి గృహము ప్రాంగణంలో నాలుగు పురాతన గదులు ఉన్నాయి. గతంలో ఈ గదులను షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ వారు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారు సంయుక్తంగా ఉపయోగించుకునేవారు. సదరు గదులు ప్రస్తుతం ఉపయోగంలో లేక, పాడు పడిపోయి దుర్గంధంతో ఉండి దుర్వాసన వస్తూ ఆ ప్రాంత వాసులకు చాలా ఇబ్బందికరంగా మారింది. దీంతో విద్యార్థినులు దుర్వాసనతో, దోమలతో, క్రిమి కీటకాలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం స్థానిక అధికారుల దృష్టిలో ఉన్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. సంబంధిత మంత్రికి, స్థానిక శాసనసభ్యుడికి, జిల్లా అధికారుల దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. అదే ప్రాంగణంలో ఉండే బాలికల వసతి గ్రామం కూడా చాలా పురాతనమైనది కాబట్టి అధికారులు వెంటనే నిరూపయోగంలో ఉన్న ప్రభుత్వ గదులను మరమ్మతు చేయించి ఉపయోగంలోకి తెచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరారు. బాలికల వసతి గృహమును కూడా మరమ్మతులు చేయించి సరైన ఉత్తర్వులు మంజూరు చేయాలని కోరారు.
BHARATH SAMACHAR DIGITAL
19, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్