భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: అధికారులు ప్రభుత్వ ఆస్తులు కాపాడాలని కనిగిరి మున్సిపల్ ఛైర్మన్ అబ్దుల్ గఫార్ షేక్ పేర్కొన్నారు. గురువారం కనిగిరి పట్టణంలోని శివనగర్ కాలనీలో ఆయన పర్యటించి మాట్లాడారు. పట్టణలోని శివనగర్ కాలనీలో వెనుకబడిన తరగతుల (బీసీ) బాలికల వసతి గృహము ప్రాంగణంలో నాలుగు పురాతన గదులు ఉన్నాయి. గతంలో ఈ గదులను షెడ్యూల్ కులాల సంక్షేమ శాఖ వారు, వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ వారు సంయుక్తంగా ఉపయోగించుకునేవారు. సదరు గదులు ప్రస్తుతం ఉపయోగంలో లేక, పాడు పడిపోయి…