భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

19, డిసెంబర్ 2025, శుక్రవారంభారత్ సమాచార్

శోభన్‌బాబు నియామకం గర్వకారణం: ఎమ్మెల్యే మురళి నాయక్

1d27c810-f36b-4e28-b7c1-98c1f62ee24e

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: అఖిలభారత కాంగ్రెస్ కమిటీ ఆదివాసి విభాగానికి జాతీయ కోఆర్డినేటర్ గా భూక్య శోభన్ బాబును నియమించడం ఆదివాసి సమాజానికి ఎంతో గర్వకారణమని ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్ అన్నారు. శోభన్ బాబును ఎమ్మెల్యే పార్టీ నాయకులతో కలిసి శుక్రవారం పూలమాలలు శాలువాలతో ఘనంగా సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆదివాసీ యువతకు నాయకత్వం అందించే స్థాయికి శోభన్‌బాబు ఎదగడం సంతోషకరమని, జాతీయ స్థాయిలో ఆదివాసీ సమస్యలను బలంగా ప్రస్తావించి, పరిష్కారాల కోసం కృషి చేస్తారని ధీమా వ్యక్తం చేశారు. శోభన్‌బాబు మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లికార్జున ఖర్గే ఆశీర్వాదంతో, ఛైర్మన్ విక్రాంత్ భూరియా మార్గదర్శకత్వంలో దేశవ్యాప్తంగా ఆదివాసి హక్కులు, అభివృద్ధి, విద్య, ఉపాధి కోసం నిబద్ధతతో పని చేస్తానన్నారు. ఎమ్మెల్యే మురళీ నాయక్ ప్రోత్సాహం, దిశానిర్దేశం తనకు ఎప్పటికీ స్ఫూర్తిగా ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా ప్రచార కమిటీ కోఆర్డినేటర్ బైరు అశోక్ గౌడ్, రాజేందర్ రెడ్డి,జనార్ధన్ పార్టీ నాయకులు, ఆదివాసి సంఘాల ప్రతినిధులు, యువ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.