భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

20, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

కోమటిపల్లిలో పెద్దమ్మతల్లి నిత్య పూజలు

WhatsApp Image 2025-12-19 at 6.13.03 PM

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మతల్లి నిత్య పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకుని శుక్రవారం రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. గ్రామ మాజీ సర్పంచ్ నీలం యాకయ్య చొరవతో, కుల సంఘం సహకారంతో ప్రారంభమైన ఈ మహోన్నత క్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది.

ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కుల పెద్దలు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు. ముదిరాజు కులస్థులు ఒక్కో రోజు ఒక్కో కుటుంబం చొప్పున బాధ్యత తీసుకుని ఈ ధూపదీప నైవేద్యాలను సమర్పిస్తున్నారు. వీరి భక్తి, ఐక్యత పరిసర గ్రామాల్లో అందరి ప్రశంసలు అందుకుంటోంది. ఈ కార్యక్రమంలో నిత్య పూజా కమిటీ ప్రతినిధులు, సభ్యులు పాల్గొన్నారు.