భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: ఇనుగుర్తి మండలం కోమటిపల్లి గ్రామంలో ముదిరాజుల కులదైవమైన పెద్దమ్మతల్లి నిత్య పూజా కార్యక్రమాలు దిగ్విజయంగా ఏడాది పూర్తి చేసుకుని శుక్రవారం రెండో సంవత్సరంలోకి అడుగుపెట్టాయి. గ్రామ మాజీ సర్పంచ్ నీలం యాకయ్య చొరవతో, కుల సంఘం సహకారంతో ప్రారంభమైన ఈ మహోన్నత క్రతువు నిర్విఘ్నంగా కొనసాగుతోంది.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక పూజల్లో కుల పెద్దలు, సంఘ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. గ్రామం ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని, పాడిపంటలు సమృద్ధిగా పండాలని అమ్మవారిని వేడుకున్నారు.…





