భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

21, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

మానవత్వం చాటుకున్న అయ్యగారిపల్లి సర్పంచ్

WhatsApp Image 2025-12-20 at 6.37.49 PM (1)

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : జిల్లాలోని అయ్యగారిపల్లి గ్రామంలో నూతన సర్పంచ్ మలిశెట్టి శోభన్ మానవత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన కారంపూడి రామస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, శనివారం ఆయన కుటుంబాన్ని సర్పంచ్ పరామర్శించారు. నిరుపేద స్థితిలో ఉన్న ఆ కుటుంబం రామస్వామి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన, తక్షణ సాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబం అధైర్యపడవద్దని, గ్రామ అభివృద్ధి కమిటీ తరపున అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ మామిడి శోభన్ బాబు, కొనతం వెంకన్న, మాలోత్ భద్రు నాయక్, బానోత్ సంధ్య నాయక్, మామిడి కిరణ్, మామిడి భద్రయ్య, మలిశెట్టి రవి తదితరులు పాల్గొని బాధిత కుటుంబానికి సానుభూతి తెలిపారు.