భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : జిల్లాలోని అయ్యగారిపల్లి గ్రామంలో నూతన సర్పంచ్ మలిశెట్టి శోభన్ మానవత్వం చాటుకున్నారు. గ్రామానికి చెందిన కారంపూడి రామస్వామి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, శనివారం ఆయన కుటుంబాన్ని సర్పంచ్ పరామర్శించారు. నిరుపేద స్థితిలో ఉన్న ఆ కుటుంబం రామస్వామి మరణంతో ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న విషయాన్ని తెలుసుకున్న ఆయన, తక్షణ సాయంగా 50 కిలోల బియ్యాన్ని అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. కుటుంబ పెద్దను కోల్పోయిన బాధిత కుటుంబం అధైర్యపడవద్దని, గ్రామ అభివృద్ధి కమిటీ తరపున అన్ని…





