భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

22, డిసెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

సమస్యల పరిష్కారంలో ముందుండాలి: వద్దిరాజు కిషన్

WhatsApp Image 2025-12-21 at 7.55.20 PM

భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : గ్రామ, వార్డుల సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ముందుండాలని బిఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు కిషన్ సూచించారు. ఆదివారం ఇనుగుర్తి ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరితో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు రమాదేవి, శ్రీనివాస్, కృష్ణ, సరిత, నూర్జహాన్‌లు కిషన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించి ఆయన అభినందనలు తెలిపారు.

 

అనంతరం వద్దిరాజు కిషన్ మాట్లాడుతూ.. ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని, స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజా విశ్వాసాన్ని పొందేలా నిరంతరం శ్రమించాలని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ దార్ల రామ్మూర్తి మరియు ఇతర పార్టీ నాయకులు పాల్గొన్నారు.