భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ : గ్రామ, వార్డుల సమస్యల పరిష్కారంలో ప్రజాప్రతినిధులు ఎల్లప్పుడూ ముందుండాలని బిఆర్ఎస్ రాష్ట్ర నేత వద్దిరాజు కిషన్ సూచించారు. ఆదివారం ఇనుగుర్తి ఉపసర్పంచ్ సత్తూరి యాదగిరితో పాటు నూతనంగా ఎన్నికైన వార్డు సభ్యులు రమాదేవి, శ్రీనివాస్, కృష్ణ, సరిత, నూర్జహాన్‌లు కిషన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని శాలువాలతో సన్మానించి ఆయన అభినందనలు తెలిపారు.
అనంతరం వద్దిరాజు కిషన్ మాట్లాడుతూ.. ప్రజలు మెచ్చేలా పాలన సాగించాలని, స్థానిక సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. ప్రజా విశ్వాసాన్ని పొందేలా…





