భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలంలోని వివిధ గ్రామాల సర్పంచులు, ఉప సర్పంచులు, వార్డు సభ్యులు సోమవారం ఘనంగా ప్రమాణ స్వీకారం చేశారు. ఎంపీడీవో బండారి పార్థసారధితోపాటు ఆయా గ్రామాల స్పెషల్ ఆఫీసర్లు, పంచాయతీ కార్యదర్శులు వారితో ప్రమాణ స్వీకారం చేయించారు. ఇనుగుర్తిలో సర్పంచి తమ్మడపల్లి కుమార్, చిన్ననాగారం చెడుపాక సుజాత, కోమటిపల్లి మద్దెల భిక్షపతి, లక్ష్మీపురం ముదిరెడ్డి కళావతి, మీట్య తండా భూక్య చిన్ని, పెద్దతండ(సీఎం) బానోతు రేణుక, అయ్యగారిపల్లి మలిశెట్టి శోభన్, చీన్య తండా జాటోత్ హరిచంద్, లాలు తండా భూక్య లక్ష్మి, పాత తండా ఇస్లావత్ రేణుక, రాము తండా భూక్య మీటు, తారా సింగ్ తండా నునావత్ భద్రు, పాత తండా ఇస్లావత్ నరేష్ ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు. ఆయా గ్రామాలకు ఉపసర్పంచ్ లు, వార్డు సభ్యులు సైతం ప్రమాణ స్వీకారం చేయడంతో ఆయా గ్రామపంచాయతీలలో పాలకవర్గాలు కొలువు తీరాయి.
BHARATH SAMACHAR DIGITAL
23, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్