భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

వివాహిత అనుమానాస్పద మృతి

04533cef-50b4-4362-ab21-bc19a27d9747

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: వివాహిత అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో చోటుచేసుకుంది. ఎస్సై చిర్ర రమేష్ బాబు తెలిపిన వివరాలు ప్రకారం.. మేచరాజుపల్లి గ్రామానికి చెందిన ఎస్‌కే జుబేదా బేగం(30) ఆదివారం తమ ఇంటి పక్కన గిన్నెల తోమే స్థలం వద్ద చీపిరితో ఊకుతున్న క్రమంలో చేతికి కరెంటు షాక్ తగిలి మృతి చెందింది. కాగా గతంలో మృతురాలికి తన భర్త షరీఫ్‌కు గొడవలు ఉన్న దృష్ట్యా, షరీఫ్ తోపాటు ఆయన తల్లిదండ్రులు జుబేదా బేగంకు కరెంట్ షాక్ పెట్టి చంపి ఉంటారని అనుమానంగా ఉందని మృతురాలి బాబాయ్ ఎండీ షర్మిల్ ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.