భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

23, డిసెంబర్ 2025, మంగళవారంభారత్ సమాచార్

యథేచ్ఛగా అక్రమ ఇసుక రవాణా

Screenshot 2025-12-23 171934

భారత్ సమాచార్, కామారెడ్డి జిల్లా: డోంగ్లీ మండలంలోని కుర్ల మంజీరా నది పరివాహక ప్రాంతంలో డంప్ చేసిన ఇసుక యథేచ్చగా అక్రమ రవాణా జరుగుతుంది. ఇంత జరుగుతున్నా ఉన్నతాధికారులు చూసి చూడనట్టుగా వ్యవహరించడం గమనార్హం. రాత్రి పగలు అనే తేడా లేకుండా అడ్డగోలుగా ఇతర రాష్ట్రలకు ఇసుక తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతీ రోజు 5 నుంచి 6 ట్రిప్పుల ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిస్తున్నట్లు సమాచారం. సంబంధిత అధిరులు వెంటనే మహారాష్ట్రకు తరలిస్తున్నవాహనాలను పట్టుకొని అక్రమ ఇసుక దళారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయా గ్రామ ప్రజలు కోరుతున్నారు.