భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

24, డిసెంబర్ 2025, బుధవారంభారత్ సమాచార్

మునిగలవీడులో నట్టల మందు పంపిణీ

5ae2ee52-a73f-4f8b-b39d-fa8d55a7f403

భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: రాష్ట్ర పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో పంపిణీ చేసే నట్టల మందును నెల్లికుదురు మండలంలోని మునిగిలవీడులో సర్పంచి బొల్లికొండ చైతన్య నాగరాజు బుధవారం గొర్రెలకు నట్టలమందు వేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ.. ఆరోగ్యవంతమైన గొర్రెల పెంపకానికి నట్టల మందును ఉపయోగించుకోవాలని గొర్రెలు, మేకల పెంపకందారులకు సూచించారు. గొర్రెలు, మేకలు అనారోగ్యానికి గురైతే ప్రభుత్వం మంజూరు చేసిన నట్టల నివారణ మందును సద్వినియోగం చేసుకోవాలని పెంపకందారులకు సూచించారు. కార్యక్రమంలో వెటర్నరీ డాక్టర్ సోమ శ్రీనివాస్, ఉప సర్పంచ్ కొమ్మనబోయిన మల్లయ్య, ఓఎస్ఓ ఐలయ్య, కొమ్మనబోయిన వెంకన్న, ఉప్పలయ్య, కడబోయిన శ్రీను, శ్రీశైలం, ముత్తయ్య, కొమరయ్య, చంద్రయ్య, గువ్వ ఉప్పలయ్య, పాయిలి వెంకన్న, బద్దె మల్లయ్య, కాంగ్రెస్, బిజెపి నాయకులు తుప్పతూరి రాజు యాదవ్, బైస్ రాజేష్, దుస్స యాకయ్య తదితరులు పాల్గొన్నారు.