భారత్ సమాచార్, మెదక్ జిల్లా: భారతీయ జనతా పార్టీ మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధామల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో బిజెపి మెదక్ జిల్లా పార్టీ కార్యాలయంలో ఈరోజు సాయంత్రం భారత మాజీ ప్రధాని, భారతరత్న అటల్ బిహారీ వాజిపెయి జయంతి ఉత్సవాల సందర్భంగా దీపోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా మట్టి ప్రమిదలతో దీపం వెలిగించి మెదక్ జిల్లా బిజెపి అధ్యక్షులు వాల్దాస్ మల్లేష్ గౌడ్ ఆధ్వర్యంలో నివాళులు అర్పించారు. కార్యక్రమంలో జగిత్యాల జిల్లా ఇన్చార్జి గడ్డం శ్రీనివాస్, జిల్లా ప్రధాన కార్యదర్శి ఈర్ల రంజిత్ రెడ్డి, పట్టణ అధ్యక్షులు నాయిని ప్రసాద్, జిల్లా మోర్చా అధ్యక్షులు గడ్డం కాశీనాథ్ సతీష్, మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శిలు ఎమ్మెల్యే రెడ్డి, నల్లల విజయ్, మెదక్ జిల్లా సీనియర్ నాయకులు ఎక్కలదేవి మధుసూదన్, లోకేష్, అల్లం మధు అంకం శ్రీనివాస్, మనోజ్, ఆంజనేయులు, శ్యాంసుందర్, సాయి తదితర బిజెపి కార్యకర్తలు పాల్గొన్నారు.