భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

కేవల్ కిషన్ పోరాటం చిరస్మరణీయం: కడారి నాగరాజు

6f2f2409-26a0-42bd-96dd-e4e930219904

భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మెదక్ ప్రాంతంలో కేవల్ కిషన్ అంటే తెలియని ప్రజలు ఉండరాని సిపిఎం నర్సాపూర్ డివిజన్ కార్యదర్శి కడారి నాగరాజు అన్నారు. కేవల్ కిషన్ పేరు వింటేనే మెదక్ ప్రాంతంలో ప్రజలకు దైర్యంమని, ప్రజల కోసం పోరాడి ప్రాణాలు వదిలిన పోరాట యోధుడు కేవల్ కిషన్ అని, ఆయన 65వ వర్ధంతి సందర్బంగా నర్సాపూర్ పట్టణంలో సిపిఎం ఆధ్వర్యంలో అయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా కడారి నాగరాజు మాట్లాడుతూ.. ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు బ్రతికిన కేవల్ కిషన్ మెదక్ జిల్లా ప్రజలకు నిరంతర చైతన్య స్ఫూర్తి అని కొనియాడారు. మెదక్ ప్రాంతంలోని భూస్వాములను గడగడాలడించిన ధీశాలుడు కేవల్ కిషన్ మెదక్ జిల్లా చిన్నశంకరంపేట్ మండలం తుర్కల మందాపూర్ గ్రామంలో కేవల్ నారాయణ, మున్నాబాయి దంపతులకు 1922 మే 10న కేవల్ కిషన్ జన్మించారు. మారుమూల ప్రాంతంలో పుట్టిన కేవల్ కిషన్ ఉన్నత చదువులు చదివి, ప్రభుత్వ ఉద్యోగం వస్తే ఉద్యోగం కాదని, పేద ప్రజల హక్కుల కోసం పోరాట మార్గాన్ని ఎంచుకుని మెదక్ ప్రాంత ప్రజలకు చైతన్య దీపిక అయ్యారు. మెదక్ ప్రాంతంలో భూస్వాములకు వ్యతిరేకంగా ప్రజలకు ఐక్యం చెస్తున్నాడానే కారణంతో 1960 సంవత్సరంలో పొలంపల్లి దగ్గర రోడ్ యాక్సిడెంట్ చేసి చంపేశారు. భూస్వాములు, గ్రామీణ ప్రాంతంలోని పెత్తందారులు కేవల్ కిషన్ ను భౌతికంగా హత్య చేసినప్పటికి ప్రజలలో నేటికీ కేవల్ కిషన్ ఆశయాలు బ్రతికే ఉన్నాయి. కేవల్ కిషన్ ను హత్య చేసిన స్థలంలో ఉన్న ఆయన సమాధి వద్ద నేటికీ ప్రజలు డిసెంబర్ 26 నాడు బండ్లు కట్టి జాతర నిర్వహిస్తున్నారంటేనే ప్రజలమదిలో కేవల్ కిషన్ నేటికీ జీవించి ఉన్నారు. ప్రజలకోసం జీవితాంతం బ్రతకడమే కాకుండా పేద ప్రజలకు తన ఆస్థిని పంచిన ఆదర్శ నేత కేవల్ కిషన్ అని పేర్కొన్నారు.

 

ఉమ్మడి మెదక్ జిల్లాలో కేవల్ కిషన్ ఆశయాలను సాధించేందుకు సీపీఎం కృషి చేస్తుందని, సంగారెడ్డి, మెదక్ జిల్లా కేంద్రాల్లో కేవల్ కిషన్ పేరుతో సిపిఎం కార్యాలయాలను ఏర్పాటు చేసి ప్రజా పోరాటాలకు కేంద్రాలుగా నిలుస్తున్నాయన్నారు. మెదక్ పట్టణంలోని కేవల్ కిషన్ భవన్ కరోనా మహమ్మారి సమయంలో హోమ్ క్వారంటైన్ సెంటర్ ఏర్పాటు చేసి కరోనా బాధితులకు అన్నితమై సేవలు అందించిందన్నారు. గత సంవత్సరం కాలం నుండి పేద పిల్లలకు ఉచిత ట్యూషన్ సెంటర్ నడుపుతుందన్నారు. మెదక్ జిల్లా కేంద్రంలో జరిగే అనేక ప్రజాపోరాటాల రూపకల్పనకు కేవల్ కిషన్ భవన్ వేదిక అవుతుంది. ప్రతి సంవత్సరం డిసెంబర్ 26 నాడు ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా కేవల్ కిషన్ వర్ధంతి సభలు నిర్వహించి, కేవల్ కిషన్ చేసిన పోరాటాలను, అయన ఆదర్శలను నేటి తరానికి అందించడానికి సిపిఎం కృషి చేస్తుంది. ఈ కార్యక్రమంలో నాఘభూషణం, నర్సాగౌడ్, సంఘాగౌడ్, భూపాల్, కుమార్ తదితరులు పాల్గొన్నారు.