భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో CMRF కొండంత అండగా నిలుస్తోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (GMR) తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆంధ్రా కాలనీకి చెందిన శివానంద గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే ద్వారా ఎల్ఓసి (LOC) కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 2.50 లక్షల విలువైన ఎల్ఓసి పత్రాన్ని పటాన్చెరులోని తన కార్యాలయంలో శివానంద కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్హులైన ప్రతి పేదవాడికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ మాజీ వైస్ చైర్మన్ ప్రభాకర్, నాయకులు వెంకటేష్, శ్రీనివాస్, షకీల్ తదితరులు పాల్గొన్నారు.