భారత్ సమాచార్.నెట్, సంగారెడ్డి జిల్లా : ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో CMRF కొండంత అండగా నిలుస్తోందని పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి (GMR) తెలిపారు. ఇస్నాపూర్ మున్సిపల్ పరిధిలోని ఆంధ్రా కాలనీకి చెందిన శివానంద గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతుండగా, మెరుగైన చికిత్స కోసం ఎమ్మెల్యే ద్వారా ఎల్ఓసి (LOC) కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు.
ప్రభుత్వం నుంచి మంజూరైన రూ. 2.50 లక్షల విలువైన ఎల్ఓసి పత్రాన్ని పటాన్చెరులోని తన కార్యాలయంలో శివానంద కుటుంబ సభ్యులకు ఎమ్మెల్యే అందజేశారు. ఈ…





