భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

27, డిసెంబర్ 2025, శనివారంభారత్ సమాచార్

వనపర్తి కలెక్టరేట్ వద్ద జర్నలిస్టుల ధర్నా

2e862aa2-368b-4ae4-b06a-144b95bf481a

భారత్ సమాచార్, వనపర్తి జిల్లా: జర్నలిస్టుల అక్రిడేషన్ జారీ కోసం నూతనంగా ఏర్పాటు చేసిన 252 జీవోను ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలని టీయూడబ్ల్యూజే‌హెచ్ 143 జిల్లా అధ్యక్షుడు బీ.శ్రీధర్ రావు డిమాండ్ చేశారు. అర్హత ఉన్న ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇవ్వాలని ఆయన కోరారు. శనివారం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు వనపర్తి జిల్లా కలెక్టరేట్ ముందు జర్నలిస్టులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీ.శ్రీధర్ రావు మాట్లాడుతూ. ప్రస్తుతం కొత్త జీవో ప్రకారం చాలా మంది జర్నలిస్టులకు అన్యాయం జరుగుతుందన్నారు. కేవలం చిన్న పత్రికలు డిజిటల్ మీడియాలను దృష్టిలో ఉంచుకొని కొత్త జీవోను పెట్టొదన్నారు. ప్రస్తుత రోజుల్లో డిజిటల్ మీడియా వేగం పుంజుకుందని ఇలాంటి సమయంలో ప్రభుత్వం అక్రిడేషన్ల కోత ఉండే విధంగా చర్యలు తీసుకోవడం తీవ్ర అన్యాయం చేస్తుందన్నారు. నిబంధనల పేరు చెప్పి జర్నలిస్టుల మధ్య తగాదాలకు ప్రభుత్వం అవకాశం లేకుండా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే 10- 20 ఏళ్ల నుండి జర్నలిస్టులు అనేక సమస్యల్లో ఉన్నారని మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఉన్న చిన్న అవకాశం కూడా లేకుండా పోయిందని జర్నలిస్టులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ప్రభుత్వం ఈ కొత్త జీవోను రద్దుచేసి 232 జీవోను అమలుపరచాలని కోరారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ యాదయ్యకు వినతిపత్రం అందజేశారు.