భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

28, డిసెంబర్ 2025, ఆదివారంభారత్ సమాచార్

మంత్రి వివేక్‌ను కలిసిన నూతన సర్పంచ్ శ్రీహరి

0fb50248-1f6d-4a53-b4a4-016b6eaed238

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: నర్సాపూర్ నియోజకవర్గంలోని పరిశ్రమల్లో స్థానిక నిరుద్యోగ యువతకు అధిక ప్రాధాన్యత కల్పించాలని కోరుతూ హత్నూర మండలం గుండ్లమాచునూర్ సర్పంచ్ బేగరి శ్రీహరి శనివారం జిల్లా ఇంచార్జి మంత్రి వివేక్ వెంకటస్వామిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఆ గ్రామ పంచాయతీ పరిధిలోని హానర్ ల్యాబ్, ఎపిటోరియా యూనిట్ –1, కోవాలేంట్ లేబరేటరీస్ పరిశ్రమలు ఉండగా స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని మంత్రి దృష్టికి తీసుకుపోయారు. పరిశ్రమల ఏర్పాటు చేసిన సమయంలో స్థానికులకు ఉపాధి, వ్యాపార అవకాశాలు కల్పిస్తామని చెప్పినా.. పరిశ్రమ యాజమాన్యాలు నేడు ఆ నిబంధనలను తుంగలో తొక్కుతూ ఇష్టరాజ్యంగా వ్యవహరిస్తున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. అంతే కాకుండా ఉన్నత చదువులు చదివినప్పటికీ స్థానిక పరిశ్రమల్లో ఉపాధి దొరకక యువకులు ఇతర ప్రాంతాలకు వలస వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని వినతి పత్రంలో పేర్కొన్నారు. తమ గ్రామ పంచాయతీ పరిధిలోని పరిశ్రమల్లో స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేలా పరిశ్రమ యాజమాన్యాలకు సూచించాలని కోరారు.