భారత్ సమాచార్

BHARATH SAMACHAR DIGITAL

29, డిసెంబర్ 2025, సోమవారంభారత్ సమాచార్

ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి

bc2ce72b-cf54-4b37-909a-2a12844c3fd1

భారత్ సమాచార్, సంగారెడ్డి జిల్లా: రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మినెంట్ చేయాలని సంగారెడ్డి జిల్లా ఔట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షులు బీ.ప్రకాష్ నాయక్ డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు పులి లక్ష్మయ్య ఆదేశాల మేరకు సంగారెడ్డి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నూతన కార్యవర్గాన్ని సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటుకు సమావేశం ఏర్పాటు చేసి సంగారెడ్డి జిల్లా ఔట్సోర్సింగ్ జేఏసీ నూతన కమిటీని ఎన్నుకున్నారు. ఔట్సోర్సింగ్ జేఏసీ నాయకులు డాక్టర్ ఏర్పుల శ్రీనివాస్ మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయంలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగస్తులు అందరూ కలిసి న్యాయబద్ధంగా ప్రభుత్వం ద్వారా పర్మినెంట్ ఉద్యోగులుగా కొనసాగించుటకు ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడానికి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు అందరూ కంకణ బదులు కావాలన్నారు. నూతనంగా ఎన్నికైన సంగారెడ్డి జిల్లా ఔట్సోర్సింగ్ జేఏసీ అధ్యక్షులు బీ.ప్రకాష్ నాయక్ మాట్లాడుతూ.. సంగారెడ్డి జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయంలో ఉన్నటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులందరూ ఐక్యమై మన బ్రతుకు రాతలు మార్చుకోవడం కోసం చట్టబద్ధంగా ప్రభుత్వ దృష్టికి తీసుకుపోవడం కోసం జిల్లా ఔట్సోర్సింగ్ జేఏసీ నూతన కమిటీని ఏర్పాటు చేయడం జరిగిందని ఈ కమిటీ ద్వారా జిల్లాలో ఉన్నటువంటి అందరు ఔట్సోర్సింగ్ ఉద్యోగుల హక్కుల కోసం వారి భద్రత కోసం న్యాయబద్ధమైన పోరాటం చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నూతన జేఏసీ ఏర్పాటుకు వివిధ ప్రభుత్వ శాఖల నుంచి విచ్చేసినటువంటి ఔట్సోర్సింగ్ ఉద్యోగులు ముక్తకంఠంతో వారి సాధకబాధకాలను తెలియజేసి వాటి పరిష్కారానికి ప్రభుత్వం ద్వారా శాశ్వత ఉద్యోగులుగా గుర్తించుటకు మన జేఏసీ తరఫున న్యాయబద్ధమైన పోరాటానికి శ్రీకారం చూట్టాలన్నారు.

సంగారెడ్డి జిల్లా ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ నూతన కమిటీ:
జిల్లా అధ్యక్షులు : బీ.ప్రకాష్ నాయక్, ఉపాధ్యక్షులు కే.శివశంకర్, బీ.రాజు, కే.శ్రీకాంత్, జే.చిరంజీవి నాయక్, ప్రధాన కార్యదర్శి యు.రాములు, సంయుక్త కార్యదర్శి బీ.నరేందర్, ఆర్.ప్రసాద్ గౌడ్, ఎన్.శంకర్, మీడియా కార్యదర్శి అబ్దుల్ కరీం, కోశాధికారి సీహెచ్.నారాయణ, సలహాదారులు డా.వై.శ్రీనివాస్, కార్యవర్గ సభ్యులు ఎం.అశోక్, ఎండీ.వాజిద్ అలీ, డీ.రాజశేఖర్, ఏ.నరసింహారెడ్డి, వీ.దేవిసింగ్, ఎన్.జలంధర్, సలీం, రాజు, వెంకట్, లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.